Advertisement

జనగామ జిల్లాలో 10 వేలు దాటిన కొవిడ్‌ కేసులు

Apr 23 2021 @ 00:57AM

 ఒక్కరోజే 387 నమోదు


జనగామ కల్చరల్‌, ఏప్రిల్‌ 22 : జనగామ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 10 వేలు దాటింది. గురువారం ఒక్కరోజే 387 కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేట్‌ హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం 90 కేసులు నమోదు కాగా దేవరుప్పుల-31, లింగాలఘణపురం-6, కొడకండ్ల-24, మల్కాపూర్‌-21, నర్మెట-5, రఘునాథపల్లి-15, స్టేషన్‌ఘన్‌పూర్‌-31, జఫర్‌గఢ్‌-46, కోమల్ల-18, పాలకుర్తి-25, బచ్చన్నపేట-21, జిల్లా ఆస్పత్రి-51, ఎంసీహెచ్‌-3 కేసులతో మొత్తం 387 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు 10278 కేసులు నమోదైనట్లు వారు పేర్కొన్నారు.


Follow Us on:
Advertisement