రికార్డు సృష్టించిన భారతీయ చిన్నారి.. 195 దేశాల పేర్లతోపాటు..!

ABN , First Publish Date - 2021-05-08T00:48:19+05:30 IST

సాధారణంగా ఎవరైనా ఒక నాలుగైదు దేశాల రాజధానుల పేర్లు, వాటి కరెన్సీని సులభంగానే గుర్తు పెట్టుకుంటారు. ఓ 20 దేశాల రాజధానుల పేర్లు, ఆయా దేశాల కరెన్సీని గుర్తు పెట్టుకోవాలంటే కాస్త కష్టమే అయినా ట్రై

రికార్డు సృష్టించిన భారతీయ చిన్నారి.. 195 దేశాల పేర్లతోపాటు..!

దుబాయి: సాధారణంగా ఎవరైనా ఒక నాలుగైదు దేశాల రాజధానుల పేర్లు, వాటి కరెన్సీని సులభంగానే గుర్తు పెట్టుకుంటారు. ఓ 20 దేశాల రాజధానుల పేర్లు, ఆయా దేశాల కరెన్సీని గుర్తు పెట్టుకోవాలంటే కాస్త కష్టమే అయినా ట్రై చేయెచ్చు. కానీ భారత్‌కు చెందిన ఓ 10ఏళ్ల బాలిక ఏకంగా 195దేశాల పేర్లను అవలీలగా చెప్పేసింది. అంతేకాకుండా వాటి రాజధానుల పేర్లతో పాటు సదరు దేశాల కరెన్సీలను గుక్కతిప్పుకోకుండా చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ క్రమంలో ఆ చిన్నారి.. ప్రపంచ నలుమూల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తల్లిదండ్రులతోపాటు దుబాయిలో నివసిస్తున్న దుబాయిలో నివసిస్తున్న 10ఏళ్ల సారా చిపాకు సంబంధించిన ఓ కార్యక్రమం మే 2న సోషల్ మీడియాలో ప్రసారం అయింది. ఈ కార్యక్రమంలో సారా చిపా.. 195 దేశాలు వాటి రాజధానుల పేర్లను ఆయా దేశాల కరెన్సీని గడగడా చెప్పేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల పేర్లను వాటి రాజధానులను ఏకబిగిన చెప్పిన వారి సంఖ్య చాలానే ఉంది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా ఈ మూడింటినీ కలిపి చెప్పలేదు. కాగా.. మొట్టమొదటగా ప్రపంచంలోని దేశాల పేర్లను వాటి రాజధానులను అక్కడి కరెన్సీలతో సహా చెప్పి సారా చిపా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఆ చిన్నారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. రాజస్థాన్‌లోని బిల్వారా ప్రాంతం సారా చిపా స్వస్థలం.


Updated Date - 2021-05-08T00:48:19+05:30 IST