10ఏళ్లకే మిలియన్లు సంపాదిస్తున్న చిన్నారి.. తనకు ఇష్టమైతే 15ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించొచ్చట!

ABN , First Publish Date - 2022-01-27T22:31:14+05:30 IST

ఆ చిన్నారి వయసు 10ఏళ్లే. కానీ రెండు కంపెనీలకు ఆమె యజమాని. మిలియన్లు సంపాదిస్తున్న ఈ చిన్నారి.. తనకు ఇష్టమైతే మరో ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్‌ను ప్రకటించొచ్చు.

10ఏళ్లకే మిలియన్లు సంపాదిస్తున్న చిన్నారి.. తనకు ఇష్టమైతే 15ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించొచ్చట!

ఎన్నారై డెస్క్: ఆ చిన్నారి వయసు 10ఏళ్లే. కానీ రెండు కంపెనీలకు ఆమె యజమాని. మిలియన్లు సంపాదిస్తున్న ఈ చిన్నారి.. తనకు ఇష్టమైతే మరో ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్‌ను ప్రకటించొచ్చు. ఏంటి.. 10ఏళ్ల అమ్మాయి రెండు కంపెనీలకు యజమాని అవడమేంటి? 15 సంవత్సరాలకే రిటైర్మెంట్ కావడమేంటి? అని ఆలోచిస్తున్నారా? నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఆస్ట్రేలియాకు చెందిన పిక్సీ కర్టీస్ అనే చిన్నారికి ఇపుడు 10ఏళ్లు. ఈ చిన్నారి తన తల్లిదండ్రుల సహాయంతో గత ఏడాది ఫిక్సీస్ ఫిడ్జెట్స్ పేరుతో కంపెనీ నెలకొల్పి.. చిన్నపిల్లలకు సంబంధించిన ఆటవస్తువులు, వాటి ఉపకరణాలను అమ్మడం ప్రారంభించింది. ఆమె టైం బాగుండటంతో కేవలం 48 గంటల్లోనే అమ్మకానికి పెట్టిన ఆట వస్తువులన్నీ అమ్ముడుబోయాయి. దీంతో ఈ చిన్నారి మరింత ఉత్సాహంతో బిజినెస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఫిక్సీస్ ఫిడ్జెట్స్ కంపెనీ మార్కెట్ విలువ కొన్ని మిలియన్లు చేరుకుంది. ఇదిలా ఉంటే.. పిక్సీ కర్టీస్ సుమారు రెండేళ్ల వయసు ఉన్నపుడే ఆమె తల్లి రాక్సీ జాసెంకో.. ఈ చిన్నారి పేరిట పిక్సీస్ బోవ్స్ అనే కంపెనీని ప్రారంభించింది. ఇది కూడా చిన్నపిల్లల ఆట వస్తువులకు సంబంధించి కావడంతో.. దీనికి కూడా మంచి లాభాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు కంపెనీల యజమానిగా పిక్సీ కర్టీస్.. ఏటా లక్షలాది రూపాయలను సంపాదిస్తోంది. ఈ సందర్భంగా రాక్సీ జాసెంకో మాట్లాడుతూ.. పిక్సీ కర్టీస్‌కు ఇష్టమైతే తనకు 15ఏళ్లు నిండిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించొచ్చని  పేర్కొన్నారు.




Updated Date - 2022-01-27T22:31:14+05:30 IST