ఏపీలో 100శాతం మొదటి డోస్: జగన్

ABN , First Publish Date - 2022-02-03T01:34:07+05:30 IST

రాష్ట్రంలో 100శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని సీఎం

ఏపీలో 100శాతం మొదటి డోస్: జగన్

అమరావతి: రాష్ట్రంలో 100శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని సీఎం జగన్ తెలిపారు. అధికారులతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జగన్  మాట్లాడారు.  91 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ వేశారన్నారు. 15–18 ఏళ్ల మధ్యవారికి 100శాతం మొదటి డోస్‌ పూర్తి చేశారన్నారు. 60 ఏళ్ల పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రికాషనరీ డోస్‌ను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 45 ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోసు అందించే విషయంలో కాల పరిమితిని తగ్గించాల్సి ఉందన్నారు. ఉండాల్సిన సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎక్కడా కూడా ఫిర్యాదులు ఉండకూడదన్నారు. కలెక్టర్లే కాదు, ఆరోగ్యశాఖ అధికారులను కూడా ఈ విషయంలో బాధ్యులను చేస్తానని ఆయన పేర్కొన్నారు. సిబ్బంది హాజరు, వారు విధులు నిర్వర్తించడం, ఆస్పత్రులకు అందుబాటులో ఉండడం అన్నీకూడా జరగాలని ఆయన ఆదేశించారు. ప్రతి శాఖలోనూ ఇది అమలు కావాలన్నారు. దీనివల్ల 90శాతం సమస్యలు తీరిపోతాయని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-03T01:34:07+05:30 IST