కోలుకున్న కరోనా రోగి.. 100 మందిపై పోలీసు కేసు!

ABN , First Publish Date - 2020-07-07T21:46:10+05:30 IST

అతడు ఇటీవలే కరోనా నుంచి బయటపడ్డాడు. దీంతో అతడి బంధువులు స్నేహితుల్లో ఆనందం ఆకాశాన్నంటింది. వారి మనసులు సంబంరంతో ఉప్పొంగాయి.

కోలుకున్న కరోనా రోగి.. 100 మందిపై పోలీసు కేసు!

న్యూఢిల్లీ: అతడు ఇటీవలే కరోనా నుంచి బయటపడ్డాడు. దీంతో అతడి స్నేహితుల్లో ఆనందం ఆకాశాన్నంటింది. వారి మనసులు సంబరంతో ఉప్పొంగాయి. ఇంకేముంది..అతడు డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగొస్తున్న సందర్భంగా అతడికి ఘనస్వాగతం పలుకుదామనుకున్నారు. సినిమా స్టైల్‌లో వెల్‌కమ్ చెప్పేందుకు ఏకంగా 100 మంది రెడీ అయిపోయారు. తొలుత స్థానికంగా ఉన్న నాలుగు రోడ్ల కూడలి వద్ద అతడికి ఆహ్వానం పలుకుతూ హల్ చల్ చేశారు. అనంతరం..అతడిని అదే ఊపు కొనసాగిస్తూ ఇంటి వరకూ తీసుకెళ్లారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఇదంతా కంటైన్మెంట్ ప్రాంతంలో జరిగిన రచ్చ. మరి సహజంగానే ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లింది.  దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆ 100 మందిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో నగర పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కూడా ఉన్నాడని తెలిసింది. అలా.. కరోనా రోగి కోలుకోవడంతో మొదలైన ఘట్టం.. 100 మందిపై పోలీసులు కేసు పెట్టడంతో ముగిసింది. ఇంతకీ ఈ గలాటా అంతా ఎక్కడనేగా  మీ సందేహం. మహారాష్ట్రలోని ఓరంగాబాద్ జిల్లాలో గల వాజీపూర్ అనే ప్రాంతంలో ఈ కథంతా నడిచింది. 

Updated Date - 2020-07-07T21:46:10+05:30 IST