10 బృందాలు.. 100 మంది పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. ఓ మహిళ రెండో పెళ్లి వల్ల ఎంత పని జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-15T18:13:15+05:30 IST

రాత్రి వేళ ఫోన్ రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. 100 మంది పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించారు. అడవుల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. దీని అంతటికీ కారణం ఓ మహిళ రెండో పెళ్లి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది

10 బృందాలు.. 100 మంది పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. ఓ మహిళ రెండో పెళ్లి వల్ల ఎంత పని జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: రాత్రి వేళ ఫోన్ రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. 100 మంది పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించారు. అడవుల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. దీని అంతటికీ కారణం ఓ మహిళ రెండో పెళ్లి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కాగా.. ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని జాల్వార్ జిల్లా ఎస్పీకి ఈ నెల 13న ఓ ఫోన్ వచ్చింది. ఫోన్ అవతలి వాళ్లు చెప్పింది విన్న ఎస్పీ కింది స్థాయి అధికారులను అలర్ట్ చేశారు. భార్యభర్తలు కిడ్నాప్ అయినట్టు తెలియడంతో.. సుమారు 100 మంది పోలీసులను 10 బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. భగవాన్‌పురా పరిసర ప్రాంతంలోని అడవుల్లో గాలింపు చర్యలను చేపట్టారు. అనంతరం స్వప్న, అర్వింద్ దంపతులను రక్షించారు. అంతేకాకుండా కిడ్నాప్‌కు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను అధికారులు వెల్లడించారు. 



స్వప్న అనే మహిళకు కొన్నేళ్ల క్రితం ధన్‌రాజ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత అదనపు డబ్బు కోసం స్వప్నను ధన్‌రాజ్ రోజూ వేధించేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక.. ఆమె అతడి నుంచి విడిపోయింది. అనంతరం అర్వింద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ విషయం తెలిసి.. ధన్‌రాజ్ అతడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా డబ్బులు డిమాండ్ చేస్తూ స్వప్న ఆమె భర్త అర్వింద్‌ను కిడ్నాప్ చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో.. భార్యాభర్తలిద్దరినీ రక్షించారు. 


Updated Date - 2022-07-15T18:13:15+05:30 IST