వెయ్యి లీటర్ల కల్తీ పామాయిల్‌ పట్టివేత

ABN , First Publish Date - 2021-06-20T05:41:13+05:30 IST

దర్శి పట్టణంలోని నూనె విక్రయ కేంద్రాలను ఫుడ్‌సేప్టీ అధికారి నాగూర్‌మీరా శనివారం తనిఖీలు నిర్వహించారు. దర్శి-కురిచేడు రోడ్డులోని నూనె విక్రయ దుకాణంలో పామాయిల్‌, సోయాబినాయల్‌ కలిపిన కల్తీ నూనె వెయ్యి లీటర్లు గుర్తించి సీజ్‌ చేశారు.

వెయ్యి లీటర్ల కల్తీ పామాయిల్‌ పట్టివేత
దర్శిలోని నూనె దుకాణంలో తనిఖీ చేస్తున్న ఫుడ్‌సేప్టీ అధికారి నాగూర్‌మీరా


ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

దర్శి, జూన్‌ 19: దర్శి పట్టణంలోని నూనె విక్రయ కేంద్రాలను ఫుడ్‌సేప్టీ అధికారి నాగూర్‌మీరా శనివారం తనిఖీలు నిర్వహించారు. దర్శి-కురిచేడు రోడ్డులోని నూనె విక్రయ దుకాణంలో పామాయిల్‌, సోయాబినాయల్‌ కలిపిన కల్తీ నూనె వెయ్యి లీటర్లు గుర్తించి సీజ్‌ చేశారు. దర్శిలో జోరుగా కల్తీనూనె విక్రయాలు శీర్షికన ఈనెల 11న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఫుడ్‌సేప్టీ అధికారి నూనె విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగూర్‌మీరా మాట్లాడుతూ వివిధ రకాల నూనె శ్యాంపిల్స్‌ తీసి పరీక్షల నిమిత్తం పంపుతున్నట్లు చెప్పారు. కల్తీ నూనె విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


Updated Date - 2021-06-20T05:41:13+05:30 IST