Viral News: బతికుండగానే చంపేసిన అధికారులు.. 102ఏళ్ల వృద్ధుడి వినూత్న నిరసన.. పెళ్లి కొడుకు గెటప్‌లో..

ABN , First Publish Date - 2022-09-10T14:13:20+05:30 IST

ఆ వృద్ధుడికి ప్రస్తుతం 102ఏళ్లు. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్న అతడిని.. బతికుండగానే అధికారులు చంపేశారు. మరణించినట్టు ప్రభుత్వ రికార్డుల్లో డిక్లెర్ చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి ఆయనకు నెల నెలా రావాల్సిన ఆర్థిక సాయం ఆగిపోయింది. ఈ నేప

Viral News: బతికుండగానే చంపేసిన అధికారులు.. 102ఏళ్ల వృద్ధుడి వినూత్న నిరసన.. పెళ్లి కొడుకు గెటప్‌లో..

ఇంటర్నెట్ డెస్క్: ఆ వృద్ధుడికి ప్రస్తుతం 102ఏళ్లు. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్న అతడిని.. బతికుండగానే అధికారులు చంపేశారు. మరణించినట్టు ప్రభుత్వ రికార్డుల్లో డిక్లెర్ చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి ఆయనకు నెల నెలా రావాల్సిన ఆర్థిక సాయం ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ వృద్ధుడు వినూత్న నిరసన చేపట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


హర్యానా(Haryana)కు చెందిన దులీ చాంద్(Duli Chand)‌కు ప్రస్తుతం 102ఏళ్లు. ఈ నేపథ్యంలోనే అతడికి ప్రభుత్వం నుంచి నెల నెలా పెన్షన్ వచ్చేది. ఉన్నట్టుండి గత మార్చి నుంచి ఆయనకు పెన్షన్ రావడం లేదు. దీంతో అధికారులను సంప్రదించాడు. ఈ నేపథ్యంలో అధికారులు చెప్పిన మాటలు విని షాకయ్యాడు. ప్రభుత్వ రికార్డుల్లో తాను చనిపోయినట్లు ఉన్నందువల్లే పెన్షన్ ఆగిపోయిందని తెలుసుకుని కంగుతిన్నాడు. అనంతరం తాను బతికే ఉన్నానని.. అలా ఎలా రికార్డుల్లో తప్పుగా పేర్కొంటారని నిలదిశాడు. తప్పును సరి చేసి, తనకు మళ్లీ పెన్షన్(Demands Pension) అందేలా చూడాలని అధికారులు కోరాడు. అయితే అధికారులు వినిపించుకోలేదు. నెలలుగా తిరుగుతున్న వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు. 






దీంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి కొడుకు గెటప్‌ ధరించి.. బ్యాండ్ మేళంతో అందంగా ముస్తాబు చేసిన గుర్రపు బండిపై ఊరేగుతూ హంగామా చేశాడు. నేను బతికే ఉన్నానంటూ ప్లకార్డులు ప్రదర్శించాడు. అంతేకాకుండా స్థానిక ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి.. ధ్రువపత్రాలను సమర్పించాడు. అనంతరం మీడియా మాట్లాడిన ఆయన.. ‘నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా అయినా ప్రయోజనం లేకపోయింది. అందువల్లే నేను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి ఈ విధంగా వినూత్న నిరసన చేపట్టాల్సి వచ్చింది’ అని పేర్కొన్నాడు. కాగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌(Viral Video)గా మారింది. 

Updated Date - 2022-09-10T14:13:20+05:30 IST