104, 108 సేవలు మరింత విస్తృతం

ABN , First Publish Date - 2021-05-11T03:43:40+05:30 IST

జిల్లాలో 104, 108 వైద్య సేవలు మరింత విస్తృతం చేయాలని జేసీ డాక్టర ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు.

104, 108 సేవలు మరింత విస్తృతం

సమావేశంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి

నెల్లూరు (వైద్యం) మే 10 : జిల్లాలో 104, 108 వైద్య సేవలు మరింత విస్తృతం చేయాలని  జేసీ డాక్టర ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం జేసీ చాంబర్‌లో 104, 108 అంబులెన్స్‌ల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కరోనా బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు కృషిచేయాలన్నారు. సకాలంలో వారిని కొవిడ్‌ ఆసుపత్రులకు తరలించాలని తెలిపారు. ప్రస్తుతం 104, 108 అంబులెన్స్‌ల సేవలు సంతృప్తికరంగా ఉందన్నారు. ఇలాగే సేవలు కొనసాగించాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి వైద్యసేవలు అవసరం ఉన్నా వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి బాధితులను ఆసుపత్రులకు చేర్చాలన్నారు. కార్యక్రమంలో 104 జిల్లా మేనేజర్‌ పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T03:43:40+05:30 IST