104, 108 వాహన సేవలు విస్త్రతంగా అందించాలి

ABN , First Publish Date - 2021-03-07T07:50:05+05:30 IST

104, 108 వాహన సేవలను విస్తృతంగా అందించాలని జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ లోకవర్థన్‌ ఆదేశించారు.

104, 108 వాహన సేవలు విస్త్రతంగా అందించాలి
సమావేశంలో ప్రసంగిస్తున్న లోకవర్థన్‌

నోడల్‌ అధికారి డాక్టర్‌ లోకవర్థన్‌ 


తిరుపతి (వైద్యం), మార్చి 6: 104, 108 వాహన సేవలను విస్తృతంగా అందించాలని జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ లోకవర్థన్‌ ఆదేశించారు. శనివారం ఆయన 104, 108 వాహన సేవలపై తిరుపతిలో సమీక్షించారు. ముఖ్యంగా 104 సిబ్బంది సమయ పాలన పాటించాలని చెప్పారు. సేవల సమాచారాన్ని వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు. సచివాలయంలో 104 సేవల డిస్‌ప్లే ఏర్పాటు చేయాలన్నారు. 108 వాహన సిబ్బంది ప్రమాద కేసులు, హై రిస్క్‌ గర్భిణుల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆపరేటివ్‌ హెడ్‌ గంగాధర్‌, జోనల్‌ మేనేజర్‌ సుధీర్‌ రెడ్డి, జోనల్‌ ఇన్‌చార్జి వెంకయ్య, జిల్లా కో-ఆర్డినేటర్‌ భాస్కర్‌ రావు, అదనపు జిల్లా మేనేజర్‌ శ్రీహరి, డాక్టర్‌ రాజా, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహమ్మద్‌ రఫీ ఉన్నారు. కాగా.. నగరంలోని నెహ్రూనగర్‌లోని అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ను లోకవర్థన్‌ తనిఖీ చేశారు. వైద్యులు, అధికారులు, ఏఎన్‌ఎంలకు పలు సూచనలిచ్చారు. పట్టణంలో వ్యాధి నిరోధక టీకాలు వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు.

Updated Date - 2021-03-07T07:50:05+05:30 IST