10,732 ఎకరాలే.. జవాద్‌ తుపాను నష్టమట!

ABN , First Publish Date - 2021-12-08T05:44:34+05:30 IST

‘జవాద్‌’ తుపాను పంట నష్టం తేలింది. వర్షాలు, ఈదురుగాలు లకు 10,732 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు తేల్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదికలి చ్చింది. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థా యిలో నష్టం తీవ్రంగా ఉంటే.. స్వల్పంగా జరిగినట్టు నివేదిక ఇవ్వడమేమిటని రైతులు, రైతు సంఘ ప్రతినిధులు, విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.మరోసారి నష్టం అంచనా వేసి నివేదిక అందించా లని డిమాండ్‌ చేస్తున్నారు.

10,732 ఎకరాలే.. జవాద్‌ తుపాను నష్టమట!
నందిగాం : వేణుగోపాలపురంలో నీటిలోనే కోసిన వరిచేను


 తేల్చేసిన వ్యవసాయ శాఖ

 ప్రభుత్వానికి నివేదిక

 పెదవివిరుస్తున్న రైతులు

 క్షేత్రస్థాయిలో పరిశీలించలేదని విమర్శలు

 ఇప్పటికీ ముంపుబారినే పొలాలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

‘జవాద్‌’ తుపాను పంట నష్టం తేలింది. వర్షాలు, ఈదురుగాలు లకు 10,732 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు  తేల్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదికలి చ్చింది. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థా యిలో నష్టం తీవ్రంగా ఉంటే.. స్వల్పంగా జరిగినట్టు నివేదిక ఇవ్వడమేమిటని రైతులు, రైతు సంఘ ప్రతినిధులు, విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.మరోసారి నష్టం అంచనా వేసి నివేదిక అందించా లని డిమాండ్‌ చేస్తున్నారు. తుపాను ముప్పు తప్పినా..మంగళవారం వరకూ కూడా వరి పొలాలు వరద నీటిలోనే ఉన్నాయి. కోసిన పంట ముంపు బారినే ఉంది. మరోవైపు పొలాల్లో వేసిన వరి కుప్పల్లో సైతం వర్షపు నీరు చేరి ధాన్యం కుళ్లిపోయింది. మొలక వచ్చి రంగు మారాయి. వాటిని ఎండబెట్టే పనిలో రైతులు ఉన్నారు. ఈ పరిస్థితు ల్లో నష్టం అంచనా ఏ విధంగా వేశారు? నివేదికలు ఏ ప్రాతిపదికన సిద్ధం చేశారు? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.  

 ఇలా తేల్చారు

జిల్లాలో 20 మండలాల పరిధిలోని 451 గ్రామాల్లో పంటకు నష్టం జరిగినట్టు అధికారులు తేల్చారు.. పలాస మండలంలో 75 గ్రామాల్లో 1,314 ఎకరాల్లో, మెళియాపుట్టి మండలంలో 45 గ్రామాల్లో 1,121 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు  గుర్తించారు. గార మండలంలో 23 గ్రామాల్లో 849 ఎకరాల్లో, కంచిలి మండలంలో 21 గ్రామాల్లో 929 ఎకరాలు, కవిటి మండలంలో 14 గ్రామాల్లో 450 ఎకరాలు, కోటబొమ్మాళి మండలంలో 12 గ్రామాల్లో 650 ఎకరాలలో వరి పంట ముంపుబారిన పడినట్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. మరో ఆరు మండలాలకు నష్టం జరిగినట్టు గుర్తించారు. అయితే చాలా గ్రామాల్లో దాదాపు పంట నేలకొరిగింది. కానీ అధికారులు అటువైపుగా రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. అలాంటప్పుడు నష్ట నివేదిక ఎలా తయారుచేశారన్నది రైతుల వాదన. మరోవైపు ప్రజాప్రతినిధుల తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలు పాడై తీవ్రంగా నష్టం వాటిల్లితే కనీసం పరామర్శించిన పాపాన పోలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం విషయంలో కూడా పెదవివిరుస్తున్నారు. ఇప్పటికే గులాబ్‌ తుపానుతో 1,194 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. కానీ పరిహారం ఇంతవరకూ అందించలేదు. ఇప్పుడు జవాద్‌ తుపాన్‌ నష్టం అంచనాలో పారదర్శకత లోపించడంతో పరిహారంపై బాధిత రైతులు ఆశలు వదులుకుంటున్నారు. పంట నష్టం అంచనాపై ‘ఆంధ్రజ్యోతి’ వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్‌ను వివరణ కోరగా జిల్లా వ్యాప్తంగా 10,732 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు గుర్తించినట్టు చెప్పారు. ప్రభుత్వానికి నివేదికలిచ్చామన్నారు. త్వరలో పరిహారంపై ప్రకటన వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.





Updated Date - 2021-12-08T05:44:34+05:30 IST