ఆపదమొక్కుల బండి ఎంతకీ రాదండి

ABN , First Publish Date - 2021-07-26T04:18:13+05:30 IST

చర్ల మండలం అత్యతం మారుమూల ప్రాతం. అనేక గ్రామాలు అటవీ ప్రాంతాల్లోనే ఉంటాయి. నిత్యం ఏదో ఒక రూపంలో గిరిజనులు, గిరిజనేతరుల ప్రమాదాలు, అనార్యోగాల బారిన పడుతుంటారు.

ఆపదమొక్కుల బండి  ఎంతకీ రాదండి
మరమ్మతులకు గురవడంతో మూలక పడేసిన 108 వాహనం

మరమ్మతులకు గురై 108 వాహనం మూలకు

అత్యవసర సమయాల్లో అందని సేవలు

నరకం చూస్తున్న చర్ల మండల వాసులు

చర్ల, జూలై 25: చర్ల మండలం అత్యతం మారుమూల ప్రాతం. అనేక గ్రామాలు అటవీ ప్రాంతాల్లోనే ఉంటాయి. నిత్యం ఏదో ఒక రూపంలో గిరిజనులు, గిరిజనేతరుల ప్రమాదాలు, అనార్యోగాల బారిన పడుతుంటారు. వారు పట్టణ ప్రాంతానికి వచ్చి వైద్యం చేయించుకోవాలంటే 108 వాహనమే దిక్కు. ప్రస్తుతం చర్ల మండలానికి 108 సేవలు నిలిచిపోయాయి. వాహనం మరమ్మతులకు గురయింది. వరం్ష పడితే చాలు వాహనం కురుస్తోంది. ఇంజన్‌లో సమస్యలు తలెత్తడంతో దాన్ని తొలగించారుజ కానీ దాని స్థానంలో మరో వాహనాన్ని ఏర్పాటు చెయ్యలేదు. నెల రోజులుగా చర్ల మండల వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఐదు రోజుల క్రితం చెన్నపురానికి చెందిన ఓమహిళ పురిటి నొప్పులతో ఇబ్బంది పడింది. 108 వాహనానికి ఫోన్‌ చేసినా ఫలితం లేకుండా పోయింది. చర్ల సీఐ విషయం తెలుసుకుని వాహనం పంపించి ఆమెను కాపాడారు. ఇలా అత్వసర సమయంలో 108 వాహనానికి ఫోన్‌ చేసినా భద్రాచలం, దుమ్ముగూడెం నుంచి వాహనం వచ్చే లోగా జరగాల్సిన నష్టం జరుగుతోంది.ఇటు చర్ల వైద్యశాల్లో వైద్యులు ఉండరు. కొయ్యూరు వైద్యశాల 4 గంటలకే మూసి వేస్తారు. మరోవైపు 108 వాహనం రాకపోవడంతో ప్రజలు నరకం చూస్తున్నారు.

Updated Date - 2021-07-26T04:18:13+05:30 IST