108లో కొవిడ్‌ బాధితురాలికి ప్రసవం

ABN , First Publish Date - 2021-05-10T05:19:55+05:30 IST

ప్రసవం కోసం వెళ్లిన కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్న గర్భిణికి వైద్యం అందించేందుకు ఒక ప్రైవేట్‌ ఆసుపత్రి నిరాకరించింది. దీంతో 108లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.

108లో కొవిడ్‌ బాధితురాలికి ప్రసవం

  ముమ్మిడివరం, మే 9: ప్రసవం కోసం వెళ్లిన కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్న గర్భిణికి వైద్యం అందించేందుకు ఒక ప్రైవేట్‌ ఆసుపత్రి నిరాకరించింది. దీంతో 108లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన ఎస్‌.శ్రావణికి పాజిటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉంది. ప్రసవం కోసం ముమ్మిడివరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి ఆదివారం వచ్చింది. కొవిడ్‌ పాజిటివ్‌ కావడంతో చేర్చుకునేందుకు ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించింది. ఆమెకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో 108లో కాకినాడ  ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా చొల్లంగి సమీపంలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.  ఆమెకిది రెండో కాన్పు. ముమ్మిడివరం అంబులెన్స్‌ టెక్నీషియన్‌ కె.రాము, డ్రైవర్‌ గుత్తుల త్రిమూర్తులు ఆమెకు అంబులెన్స్‌లో వైద్యసేవలందించారు. తల్లీ, బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు వారు తెలిపారు.

Updated Date - 2021-05-10T05:19:55+05:30 IST