పశువులకు 108 తరహా వైద్య సేవలు

ABN , First Publish Date - 2022-05-20T06:45:14+05:30 IST

108 తరహాలో పశువులకు వైద్య సేవలు అందనున్నాయి.

పశువులకు 108 తరహా వైద్య సేవలు
పశువైద్య సేవల వాహనాలు

జిల్లాకు 14 అంబులెన్స్‌లు కేటాయింపు 

అందుబాటులో 1962 టోల్‌ఫ్రీ నంబరు 

చిత్తూరు (సెంట్రల్‌), మే 19: 108 తరహాలో పశువులకు వైద్య సేవలు అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం గురువారం విజయవాడలో సంచార పశువైద్య సేవల వాహనాలను ప్రారంభించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కేటాయించిన 14 అంబులెన్స్‌ వాహనాలు జిల్లాకు బయలుదేరాయి. మూగజీవాలు జబ్బుల బారిన పడినప్పుడు టోల్‌ఫ్రీ నంబరు 1962కు ఫోన్‌ చేయాల్సి ఉంది. రైతు పేరు, ఉన్న ప్రాంతం చెబితే అక్కడికి వాహనం వస్తుంది. పశువులనను పరీక్షించి, తగిన మందులు అందజేస్తుంది.  


Updated Date - 2022-05-20T06:45:14+05:30 IST