నంద్యాలలో 10వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రం లీక్

Published: Wed, 27 Apr 2022 14:19:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon

నంద్యాల: జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపుతోంది. వాచ్‌మెన్ ద్వారా రూమ్ నెంబర్ 3 నుండి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీక్‌పై ఎంఈవో శ్రీధరరావు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఎంఈఓ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పాఠశాల ఇన్విజిలేటర్, సూపర్వైజర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.