Hyd: టెన్త్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి Sabita

ABN , First Publish Date - 2022-06-30T21:44:15+05:30 IST

పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

Hyd: టెన్త్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి Sabita

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) విడుదల చేశారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంత్రి ఫలితాలను వెల్లడించారు. 5 లక్షల 9 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి కూడా అమ్మాయిలే పై చేయి సాధించారు. బాలికలు 92.45 శాతం, బాలురు 87.61 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో తొలి స్థానంలో 97.85 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా నిలువగా.. చివరిలో 79 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ నిలిచింది. ఇక గురుకుల పాఠశాలల్లో 99.32 శాతం.. ప్రభుత్వ పాఠశాలలో 75.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను www.bse.telangana. gov.in, www.bseresults.telanana. gov.in  వెబ్‌ సైట్‌ నుంచి పొందవచ్చని అధికారులు ప్రకటించారు.


ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని మంత్రి సబితా తెలిపారు. కాగా మూడు వేల పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు. 15 స్కూల్స్‌లో ఒక్కరూ కూడా పాస్ కాలేదని చెప్పారు.

Updated Date - 2022-06-30T21:44:15+05:30 IST