సీమా ఇప్పుడు రెండు కాళ్లతో నడుస్తోంది.. రెండేళ్లుగా పడిన నరకానికి ఎట్టకేలకు విముక్తి..!

ABN , First Publish Date - 2022-05-28T18:41:45+05:30 IST

ఒంటి కాలితో కిలోమీటర్ గెంతుకుంటూ రోజు పాఠశాలకు వెళ్లే బీహారీ బాలిక సీమా కష్టానికి ఫుల్‌స్టాప్ పడింది.

సీమా ఇప్పుడు రెండు కాళ్లతో నడుస్తోంది.. రెండేళ్లుగా పడిన నరకానికి ఎట్టకేలకు విముక్తి..!

ఒంటి కాలితో కిలోమీటర్ గెంతుకుంటూ రోజు పాఠశాలకు వెళ్లే బీహారీ బాలిక సీమా కష్టానికి ఫుల్‌స్టాప్ పడింది. రెండేళ్లుగా ఈ బాలిక పడిన నరకానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. స్థానిక అధికారులు ఆమెకు ప్రోస్థటిక్ కాలు అమర్చారు. దాంతో ఆమె చక్కగా నడవగలుగుతోంది. తమ కూతురికి సహాయం చేసిన వారికి ఆ కుటుంబం వేల వేల దండాలు పెడుతోంది. 


ఇది కూడా చదవండి..

ఈ బాలిక సంకల్పానికి హ్యాట్సాఫ్.. ఒంటికాలితో గెంతుకుంటూ రోజూ పాఠశాలకు.. టీచర్ అవ్వాలని కోరిక..!




బీహార్‌‌లోని ఫతేపూర్‌కు సమీపంలోని ఖైరా గ్రామానికి చెందిన సీమ కన్నీటి గాథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండేళ్ల క్రితం ఓ ప్రమాదంలో సీమా ఓ కాలు కోల్పోయింది. అయినా నిరాశపడకుండా ఒంటి కాలిపై గెంతుతూ స్కూల్‌కు వెళ్లి చదువుకుంటోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎంతో మంది  నెటిజన్లు ఆ చిన్నారికి మద్దతుగా నిలిచారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ కూడా చలించిపోయారు. ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. 


సోనూ సూద్ కంటే ముందుగానే స్థానిక అధికారులు సీమాకు సహాయం చేశారు. లక్షలు ఖర్చు పెట్టి ఆమెకు ప్రోస్థటిక్ కాలును అమర్చారు. దీంతో సీమా ప్రస్తుతం రెండు కాళ్లపై చక్కగా నడవగలుగుతోంది. తనకు చాలా సంతోషంగా ఉందని, టీచర్ కావాలనే తన కల నెరవేర్చుకునేందుకు కష్టపడి చదువుతానని సీమా చెబుతోంది. సీమా కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. 



Updated Date - 2022-05-28T18:41:45+05:30 IST