11 జిల్లాల్లో వర్షాభావం..!

ABN , First Publish Date - 2022-07-12T17:46:27+05:30 IST

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే మరో 11 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. వ్యవసాయశాఖ మంత్రి

11 జిల్లాల్లో వర్షాభావం..!

                          - నాట్లు వేసేందుకు నీళ్లు కరువు


బెంగళూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే మరో 11 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్‌ ఈ విషయాన్ని సోమవారం మీడియాకు తెలిపారు. బళ్లారి, కొప్పళ, రాయచూరు, విజయనగర, బాగల్కోటె, విజయపుర, రామనగర, చిక్కబళ్ళాపుర, తుమకూరు, కోలారు, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో అనావృష్టి నెలకొని ఉందన్నారు. ఒకటిరెండు జిల్లాల్లో తుంపర తప్ప భారీ వర్ష సంకేతాలే కనిపించలేదన్నారు. ఫలితంగా వ్యవసాయ పనులు మందగతిన సాగుతున్నాయన్నారు. నాట్లు వేసేందుకు అనువైన రీతిలో భూమి తడవకపోవడమే ఇందుకు కారణమన్నారు. భారీ వర్షాలు కురుస్తు న్న కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వ్యవసాయ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. 


Updated Date - 2022-07-12T17:46:27+05:30 IST