పట్టా కోసం రూ.11 వేలు

ABN , First Publish Date - 2021-03-02T05:36:24+05:30 IST

యం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పని మాత్రం చేయలేదు. దీంతో ఆ వృద్ధ రైతు నేరుగా తహసీల్దారుకే ఫిర్యాదుచేశారు. ఇందుకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాళ్లవలస గ్రామానికి చెందిన కురమాన వెంకయ్యకు 19

పట్టా కోసం రూ.11 వేలు
తహసీల్దార్‌కు ఆర్‌ఐపై ఫిర్యాదు చేస్తున్న వృద్ధ రైతు కురమాన వెంకయ్య




ఆర్‌ఐపై ఫిర్యాదు చేసిన వృద్ధ రైతు                                                       

సంతబొమ్మాళి, మార్చి 1: ఓ పేద వృద్ధ రైతు భూమి పట్టా కోసం దరఖాస్తు చేసుకుంటే రూ.11 వేలు వసూలు చేశాడు ఓ రెవెన్యూ అధికారి. కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పని మాత్రం చేయలేదు. దీంతో ఆ వృద్ధ రైతు నేరుగా తహసీల్దారుకే ఫిర్యాదుచేశారు. ఇందుకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాళ్లవలస గ్రామానికి చెందిన  కురమాన వెంకయ్యకు 1972లో చిన్న తుంగాం రెవెన్యూ గ్రూపు పరిధిలో పర్రివాని చెరువు పక్కన 36 సెంట్ల భూమిని ప్రభుత్వం లీజుకిచ్చింది. అప్పటి నుంచి ఆ భూమి ఆయన స్వాధీనంలోనే ఉంది. అయితే దీనికి శాశ్వత పట్టా మంజూరు చేయిస్తానని వీఆర్‌ఏ సోములు నమ్మబలికాడు. ఆర్‌ఐ రాధాకృష్ణకు పరిచయం చేశాడు. ఆర్‌ఐకి నాలుగు విడతలుగా రూ.11 వేలను వెంకయ్య అందించాడు. మూడు నాటుకోళ్లను సైతం అందించానని చెబుతున్నాడు. కానీ పనిమాత్రం చేయలేదని సోమవారం తహసీల్దారు రాంబాబుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశాడు. దీనిపై విచారణ చేసి న్యాయం చేస్తానని తహసీల్దారు హామీ ఇచ్చారు. ప్రస్తుతం కోటబొమ్మాళి మండలంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఐ రాధాకృష్ణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా  ఈ ఆరోపణలో నిజం లేదన్నారు. తాను ఎవరి వద్దనూ డబ్బులు వసూలు చేయలేదని చెప్పారు.  





Updated Date - 2021-03-02T05:36:24+05:30 IST