అద్భుతం.. 11ఏళ్ల బాలుడు.. 20 గంటలపాటు ఫ్రిడ్జ్‌లోనే.. అయినా..

ABN , First Publish Date - 2022-04-22T21:03:23+05:30 IST

ఫిలిప్పీన్స్‌లో అద్భుతం చోటు చేసుకుంది. 11ఏళ్ల బాలుడు 20 గంటలపాటు ఫ్రిడ్జ్‌లోనే గడిపాడు. అయినా అతడు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైర

అద్భుతం.. 11ఏళ్ల బాలుడు.. 20 గంటలపాటు ఫ్రిడ్జ్‌లోనే.. అయినా..

ఇంటర్నెట్ డెస్క్: ఫిలిప్పీన్స్‌లో అద్భుతం చోటు చేసుకుంది. 11ఏళ్ల బాలుడు 20 గంటలపాటు ఫ్రిడ్జ్‌లోనే గడిపాడు. అయినా అతడు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఇంతకూ అతడు ఫ్రిడ్జ్‌లోకి ఎందుకున్నాడనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఫిలిప్పీన్స్‌ను ఇటీవల మెగీ తుఫాను వణికించింది. తుఫాను కారణంగా పిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తాయి. బేబే సిటీలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో బేబే సిటీలో కుటుంబ సభ్యులతో నివసిస్తున్న సీజే జాస్మీ ఇంటిని వరద నీరు, బురద ముంచెత్తింది. ఈ అనూహ్య ఘనతో 11 ఏళ్ల సీజే జాస్మీ.. భయాందోళనలకు గురయ్యాడు. ప్రాణాలను కాపాడుకోవడానికి ఫ్రిడ్జ్‌లో దాక్కున్నాడు. తుఫాను బీభత్సం కాస్త తగ్గగానే స్థానిక అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సుమారు 20 గంటల తర్వాత ఫ్రిడ్జ్‌లో సీజే జాస్మీని అధికారులు గుర్తించారు. 



అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అధికారులు.. 20గంటలపాటు ఫ్రిడ్జ్‌లో ఉన్నప్పటికీ ఆ చిన్నాడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డట్టు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఫ్రిడ్జ్ డోర్ పగలగొట్టి సీజే జాస్మీని రక్షించిన వెంటనే అతడు పలికిన మొదటి పదాలను అధికారులు వెల్లడించారు. ‘నాకు ఆకలిగా ఉంది’ అంటూ సీజే జాస్మీ వ్యాఖ్యానించాడని చెప్పారు. ప్రమాదం కారణంగా ఆ చిన్నోడి కాలు విరిగిందని.. అయితే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.


Updated Date - 2022-04-22T21:03:23+05:30 IST