112 రోజులు, 92 ఎంజీయోలు.. 32 స్టెంట్లు

ABN , First Publish Date - 2022-06-21T06:35:53+05:30 IST

112 రోజులు, 92 ఎంజీయోలు.. 32 స్టెంట్లు

112 రోజులు, 92 ఎంజీయోలు.. 32 స్టెంట్లు
క్యాథ్‌ల్యాబ్‌లో గుండెకు స్టెంట్‌ వేస్తున్న వైద్యులు

పేదలకు వరంలా ఖమ్మం ప్రభుత్వాసుపత్రి క్యాథ్‌ల్యాబ్‌

రోగులకు ఉచితంగా లక్షల విలువైన, అరుదైన ఆపరేషన్లు

అభినందనలు అందుకుంటున్న వైద్యబృందం 

ఖమ్మం కలెక్టరేట్‌, జూన 20: ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో క్యాఽథ్‌ల్యాబ్‌ ప్రారంభమై 112 రోజులు... అందుబాటులోకి వచ్చి 82 రోజులు. ఇప్పటి వరకు 92ఎంజియోగ్రామ్‌లు నిర్వహించి 32 మందికి స్టెంట్లు వేసి.. ఖరీదైన వైద్యచికిత్సలు అందిస్తూ వైద్యులు ప్రశంసలు అందుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని తర్వాత ఖమ్మంలోనే ప్రారంభమైన క్యాథ్‌ల్యాబ్‌ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఛత్తీ్‌సగఢ్‌, ఆంధ్రప్రదేశలోని వివిధ ప్రాంతాల నుంచి వైద్యం కోసం రోగులు ఖమ్మం జిల్లా ఆస్పత్రికి వస్తున్నారు. 540 పడకల సామర్థ్యమున్న ఈ ఆస్పత్రిని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చి కార్పొరేట్‌కు తీసిపోని విధంగా వైద్య సౌకర్యాలను కల్పించింది. ఈ క్రమంలో ఖమ్మం ప్రధాన ఆస్పత్రిలో రూ.7కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన క్యాథ్‌ల్యాబ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు ప్రారంభించారు. దీంతో ఇప్పటి వరకు  హైదరాబాద్‌లోనే కార్పొరేట్‌ వైద్యశాలల్లో మాత్రమే ఉన్న గుండె సంబంధిత వ్యాధులను నిర్థారించే ‘క్యాథ్‌ల్యాబ్‌’ జిల్లా వాసులకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ గుండె శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్‌ సీతారాంతోపాటు ఎనస్థీషియా డాక్టర్‌ సురేష్‌, తదితరులు సేవలందిస్తున్నారు. 


సేవలందుతున్నాయిలా..

క్యాథ్‌ల్యాబ్‌ ద్వారా ఎంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్‌, ఫేస్‌మేకర్లు, గుండె కు సంబందించిన లోపాలను తెలుసుకునే వీలు కలిగింది. ఈ పరీక్షల ద్వారా గుర్తించిన రోగుల గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలు పాడైతే స్టెంట్లు వేస్తున్నారు. ( ఐసీడీ ) గుండె కొట్టుకోవడంలో లోపాలను ఈ మిషనద్వారా తెలుసుకుని సరిచేస్తారు. గుండెకు రక్తం పంపింగ్‌లోనూ(సీఆర్‌పీ) లోపాలు ఉంటే దీని ద్వారా గుర్తించి సరిచేస్తారు. అంతే కాకుండా ఫ్రాక్షనఫ్లో రిజర్వ్‌ విధానం ద్వారా గుండె రక్తనాళాల్లో పూడికలు, కొవ్వు పేరుకుపోతే దీనికి స్టెంట్‌ వేసేందుకు ప్రెజర్‌ వైర్‌ ద్వారా పూడికల సమీపంలో బెలూన ద్వారా తొలగిస్తారు. గుండె కవాటాల మార్పిడి, కవాటాలకు మరమ్మతులు, గుండె చుట్టూ నీరు చేరితే వాటిని తొలగించడం సాధ్యమవుతోంది. చిన్నప్లిలల్లో గుండెకు రంధ్రం పడితే వాటిని పూడ్చడం, పక్షవాతం, మూత్రపిండాలు, మెదడు, కాళ్లలో రక్తనాళాలు పాడైతే గుర్తించి వాటికి స్టెంట్స్‌ వేసే అవకాశం ఉంటుంది. 


ఇపటివరకు ఇలా.. 

క్యాథ్‌లాబ్‌లో ఇప్పటి వరకు 132 మంది రోగులకు మెరుగైన ఖరీదైన వైద్యాన్ని అందించారు. వీరిలో 92 మందికి ఎంజీయోగ్రామ్‌ చేశారు. ప్రైవేటులోఅయితే ఒక్కో ఎంజియోకు రూ.12 వేల నుంచి రూ.5వేల వరకు తీసుకుంటారు. ఇక 35 మందికి స్టెంట్లు వేయగా.. ప్రైవేటులో ఒక్కో స్టెంట్‌కు రూ.లక్షన్నర వరకు ఖర్చవుతుంది. నలుగురికి ఫేస్‌ మేకర్‌, మరో నలుగురికి బెలూనతో రక్తనాళాలను శుభ్రపరిచారు. ఇవి కూడా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అయితే అత్యంత ఖరీదైనవే. ఇవన్నీ జిల్లా ఆస్పత్రిలో మూడు నెలలుగా రోగులకు ఉచితంగా అందుతున్నాయి. 

అరుదైన ఆపరేషన చేసిన వైద్యులు

భద్రాద్రి జిల్లా దమ్మపేటకు చెందిన 30 ఏళ్ల వయసున్న వికలాంగ, మూడున్నర అడుగుల మరుగుజ్జు యువతి టి.సీతకు గత శుక్రవారం ఛాతీలో తీవ్రమైన నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఆమె ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు డాక్టర్‌ సీతారాం ఆమెకు పరీక్షలు నిర్వహించి ఎంజీయోగ్రామ్‌ చేశారు. అయితే గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రెండు నాళాలు మూసుకుపోయాయని గుర్తించి ఆమెకు రెండు స్టెంట్లు వేశారు. చిన్నవయస్సులోనే స్టెంట్లు వేసే పరిస్థితి రావడం.. చాలా అరుదైన సంఘటన అని ఆమెకుబోన కైపోస్కోలియోసినతో ఇబ్బంది పడుతుండడంతో ఎంతో జాగ్రత్తగా, చాకచక్యంగా ఆమెకు స్టెంటు వేశామని డాక్టర్‌ సీతారాం తెలిపారు. మూడు రోజుల్లోనే ఆమె పూర్తిగా కోలుకుందని దీంతో సోమవారం ఆమెను డిశ్చార్జి చేశామన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా ఆస్పత్రి క్యాథ్‌ల్యాబ్‌లో సంబురాలు చేశారు. ఈ క్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ సీతారాం, డాక్టర్‌ టి.సురేష్‌, క్యాథ్‌ల్యాబ్‌ టెక్నీషియన్లను పలువురు అభినందించారు. 

Updated Date - 2022-06-21T06:35:53+05:30 IST