లోక్‌ అదాలత్‌లో 1145 కేసులు పరిష్కారం

ABN , First Publish Date - 2022-06-27T04:23:48+05:30 IST

జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో రాజీమార్గం ద్వారా 1145కేసులు పరిష్కరించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ తెలిపారు.

లోక్‌ అదాలత్‌లో 1145 కేసులు పరిష్కారం
రాజీమార్గంలో ఇరువర్గాలను కలుపుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ

ఆసిఫాబాద్‌, జూన్‌ 26: జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో రాజీమార్గం ద్వారా 1145కేసులు పరిష్కరించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌అదాలత్‌ ద్వారానే సత్వ రన్యాయం జరుగుతుందన్నారు. కోర్టు చుట్టూ తిరు గుతూ సమయంవృధా చేసుకుంటున్న కక్షిదారుల సమస్యలకు పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ అన్నారు. లోక్‌అదాలత్‌లో లభించిన తీర్పుఅంతిమం అవు తుందన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌జడ్జి వెంకటేష్‌, న్యాయమూర్తులు ఉమామహేశ్వరి, షరీనామహమ్మద్‌, రవి, బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు సతీష్‌బాబు, ఏపీజీ దీపక్‌రావు పాల్గొన్నారు.

రాజీమార్గమే రాచమార్గం

సిర్పూర్‌(టి): రాజీమార్గమే రాచమార్గమని సిర్పూర్‌(టి) న్యాయమూర్తి పి రవి అన్నారు. ఆది వారం మండల కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీ య లోక్‌అదాలత్‌ నిర్వహించి మాట్లాడారు. కక్షిదా రులు కేసులను లోక్‌అదాలత్‌లో రాజీమార్గం ద్వారా పరిష్కరించుకుంటే ఇరువర్గాలకు లబ్ధిచేకూరు తుంద న్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ లోక్‌అదాలత్‌లో చిన్నచిన్న కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకుంటే తిరిగి అప్పీల్‌కు పోరా దన్నారు. కార్యక్రమంలో పీపీ ఎలియేషా, న్యాయవా దులు గణపతి, సతీష్‌, శ్రీనివాస్‌, దయారాజ్‌సింగ్‌, సీఐ బుద్ధేస్వామి, ఎక్సైజ్‌ సీఐ, ఎస్సైలు, కక్షిదారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T04:23:48+05:30 IST