
ఇంటర్నెట్ డెస్క్: ప్రజలకు బలవంతంగా కరోనా టీకాలను వేసేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలోని ఫెడరల్ అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందంటూ అమెరికా రాష్ట్రాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. బైడెన్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఇప్పటివరకూ 12 రాష్ట్రాలు కోర్టులో కేసులు వేశాయి. ఫెడరల్ కాంట్రాక్టర్ల ద్వారా ప్రజలకు బలవంతంగా టీకాలు వేయాలనుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రిపబ్లికన్ సెనెటర్ ఒకరు వ్యాఖ్యానించారు. కాగా.. అందరూ కరోనా టీకాలు వేసుకుంటే కరోనా సంక్షోభానికి ముగింపు పలకొచ్చని బైడెన్ చెబుతున్నారు. మరోవైపు.. రిపబ్లికన్లు మాత్రం ఈ బలవంతపు టీకాకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చట్టపరంగా ఈ ప్రయత్నాలను ఎదుర్కొంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.