
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా 12ఏళ్ల పిల్లలు తమ సంతోషమే ముఖ్యం అన్నట్టుగా ఉంటారు. ఎదుటి వాళ్ల కష్టనష్టాలు, బాధలతో పని లేకుండా సంతోషంగా గడుపుతుంటారు. కానీ ఓ కుర్రాడికి మాత్రం ఎదుటి వారి బాధలను అర్ధం చేసుకోడం తెలుసు.. అంతేకాకుండా చేతనైన సహాయం చేయడం కూడా బాగా తెలుసు. ఈ క్రమంలోనే సుమారు రెండేళ్ల పాటు గుడారాల్లోనే నిద్రపోతూ.. ఏకంగా రూ.7కోట్లు కూడబెట్టాడు. కాగా.. తాను కూడబెట్టన మొత్తాన్ని ఆ కుర్రాడు దేని కోసం కేటాయించనున్నాడనే వివరాల్లోకి వెళితే..
బ్రిటన్కు చెందిన మాక్స్ వూసేకి ప్రస్తుతం 12ఏళ్లు. సుమారు రెండు సంవత్సరాల క్రితం.. వృద్ధ వయసులో ఉన్న రోగులకు ధర్మశాలల్లో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్నాడు. మంచి పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు తన వంతు సాయంగా ఏదైనా చేయాలని భావించాడు. ఇందులో భాగంగానే తన లగ్జరీలైఫ్ను వదులుకున్నాడు. బ్రిటన్లోని ప్రముఖ ప్రాంతాల్లో గుడారం వేసుకుని, రోజు రాత్రి అందులో నిద్రపోతూ విరాళాలు సేకరించాడు. ఈ నేపథ్యంలోనే రూ.7కోట్లు కూడబెట్టాడు. పెద్ద మొత్తంలో డబ్బులు జబకావడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన మాక్స్.. ఆ డబ్బులను స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశం అవగా.. అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి