కృష్ణా: జిల్లాలోని కంచికచెర్ల మండలంలో పోలీసులు తనఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా దొనబండ సమీపంలో 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని నర్సీపట్నం నుంచి ముంబైకి తరలిస్తున్న సమయంలో 120 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా నిందితుల నుంచి, రెండు కార్లు, 5 సెల్‌ఫోన్ల్ తీసుకుని సీజ్ చేసి.. అనంతరం నలుగురు నిందితులతో పాటు ఒక మహిళను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.