లక్ష్మీపం్‌పహౌజ్ నుంచి ఆరు మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోత దృశ్యం
మహదేవపూర్, జనవరి 23: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి వద్ద నిర్మించిన లక్ష్మీ పంప్‌హౌజ్‌లో ఆరు మోటార్లతో నీటి ఎత్తిపోతలు శనివారం కూడా కొనసాగాయి. అన్నారం వద్ద నిర్మించిన సరస్వతీ బ్యారేజీలోకి 12,100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్టు అధికారులు తెలిపారు.