1224 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-05-11T05:40:25+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య 1200 మార్కును మరోసారి దాటేసింది.

1224 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య 1200 మార్కును మరోసారి దాటేసింది. 24గంటల వ్యవధిలో 1224 మంది కరోనా బారిన పడ్డారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 73,313 కు చేరుకుంది. మరో ఇద్దరు మృతిచెందారు. మృతుల సంఖ్య 572కు చేరింది. కోవిడ్‌ నుంచి కోలుకున్న 969 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకూ 65,630 మంది కోలుకున్నారు. హోం ఐసోలేషన్‌లో 5,184 మంది, ప్రభుత్వ ప్రైవేటు కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 1,931 మంది చికిత్స పొందుతున్నారు. 

మండలాల వారీగా కేసులు..

జిల్లాలో 49 మండలాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కడపలో కడపలో 212 కేసులు నమోదయ్యాయి. రైల్వేకోడూరులో 81, రాజంపేట 77, మైదుకూరు 47, వేంపల్లె 45, ఖాజీపేట 45, పోరుమామిళ్ల 41, ఓబులవారిపల్లె 41, నందలూరు 40, పులివెందుల 37, బద్వేలు 35, గాలివీడు 34, చిట్వేలి 30, దువ్వూరు 30, బిమఠం 27, రాయచోటి 27, పెనగలూరు 26, కాశినాయన మండలంలో 24 కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రొద్దుటూరులో 23, చెన్నూరు 21, సిద్దవటం 21, సింహాద్రిపురం 19, మైలవరం 18, కలసపాడు 17, కొండాపురం 17, పెండ్లిమర్రి 16, ఎర్రగుంట్ల 15, జమ్మలమడుగు 15, చిన్నమండెం 14, పుల్లంపేట 14, సంబేపల్లె 13, ఒంటిమిట్ట 12, చక్రాయపేట 11, ఎల్‌ఆర్‌పల్లె 10, వీఎన్‌పల్లె 10, టి.సుండుపల్లె 8, సీకేదిన్నె 7, కమలాపురం 6, లింగాల 6, రామాపురం 4, అట్లూరు 4, బికోడూరు 4, పెద్దముడియం 3, వీరబల్లె 3, వేముల 3, రాజుపాలెం 2,  వల్లూరు 2, చాపాడు 2, తొండూరు 2,  ముద్దనూరు మండలంలో 1, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిలో 2 కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2021-05-11T05:40:25+05:30 IST