తెలుగుజాతి ముద్దుబిడ్డ అల్లూరి : ఎమ్మెల్యే నిమ్మల

ABN , First Publish Date - 2022-07-03T07:45:01+05:30 IST

అల్లూరి సీతారామరాజు తెలు గు జాతి ముద్దుబిడ్డ అని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు.

తెలుగుజాతి ముద్దుబిడ్డ అల్లూరి : ఎమ్మెల్యే నిమ్మల
అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

పాలకొల్లు అర్బన్‌, జూలై 2: అల్లూరి సీతారామరాజు తెలు గు జాతి ముద్దుబిడ్డ అని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం స్థానిక కెనాల్‌ రోడ్డులోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి 125వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి అల్లూరి పేరుపెట్టాలని డిమాండ్‌ చేశారు. పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T07:45:01+05:30 IST