భారత్, చైనా సైనిక కమాండర్ల పన్నెండో విడత చర్చలు శనివారం

ABN , First Publish Date - 2021-07-31T00:13:34+05:30 IST

భారత్, చైనా సైనిక కమాండర్ల పన్నెండో విడత చర్చలు

భారత్, చైనా సైనిక కమాండర్ల పన్నెండో విడత చర్చలు శనివారం

న్యూఢిల్లీ : భారత్, చైనా సైనిక కమాండర్ల పన్నెండో విడత చర్చలు శనివారం జరుగుతాయి. దాదాపు 14 నెలల నుంచి ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను సడలించడంపై దృష్టి పెడుతూ ఈ చర్చలు జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు శుక్రవారం తెలిపాయి. 


పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, భారత సైన్యం, చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలకు చెందిన కార్ప్స్ కమాండర్ లెవెల్ అధికారులు శనివారం ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభిస్తారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా వైపున ఉన్న మోల్డో వద్ద ఈ చర్చలు జరుగుతాయి. హాట్ స్ప్రింగ్స్, గోగ్రాలలో ఓ ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 


ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య ఏప్రిల్ 9న జరిగిన చర్చల్లో సరిహద్దుల్లోని ఘర్షణ ప్రాంతాలన్నిటి నుంచి  సైన్యాన్ని ఉపసంహరించాలని, ఉద్రిక్తతలు తగ్గడానికి అదే ముఖ్యమని చైనా సైన్యానికి భారత్ సైన్యం చెప్పింది. 


ఇరు దేశాల సైన్యాల మధ్య చర్చలు 2020 జూన్ 6 నుంచి ప్రారంభమయ్యాయి. తొమ్మిదో రౌండ్ చర్చల తర్వాత పాంగాంగ్ సో సెక్టర్‌ నుంచి ఫ్రంట్ లైన్ ట్రూప్స్, ఆయుధాల ఉపసంహరణ జరిగింది. 


Updated Date - 2021-07-31T00:13:34+05:30 IST