
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,337 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 20,38,690 కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 9 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 14,070 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 14,699 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 20,09,921 మంది రికవరీ అయ్యారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 173 మందికి కరోనా సోకింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కసుల సంఖ్య 6,94,564కు చేరింది.