Python Hunted Dog: 14 అడుగుల కొండచిలువ.. ఓ కుక్కపై దాడి చేసి అమాంతం చుట్టేసింది.. చివరకు..

ABN , First Publish Date - 2022-07-27T21:26:31+05:30 IST

అడవుల నరికివేత ఎక్కువ కావడంతో వన్య మృగాలు తరచుగా జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి.

Python Hunted Dog: 14 అడుగుల కొండచిలువ.. ఓ కుక్కపై దాడి చేసి అమాంతం చుట్టేసింది.. చివరకు..

 అడవుల నరికివేత ఎక్కువ కావడంతో వన్య మృగాలు తరచుగా జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. పెద్దపులి, చిరుత, కొండ చిలువలు వంటివి ఊళ్లలోకి వచ్చి భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌ (Rajasthan) లోని కోట ప్రాంతంలో ఉన్న ఓ థర్మల్ యార్డుకు ఓ భారీ కొండచిలువ (python) వచ్చింది. దానిని చూసి అందరూ భయపడి పారిపోయారు. 


ఇది కూడా చదవండి..

Teacher: మీరు నిరుత్సాహపరిచినా నేను పాస్ అయ్యా అంటూ టీచర్‌కు స్టూడెంట్ మెసేజ్.. అవతలి నుంచి రిప్లై ఏంటంటే..


14 అడుగుల పొడువున్న ఆ కొండచిలువ యార్డు వెలుపల ఉన్న కుక్కను పట్టుకుంది. దానిని చుట్టేసింది. ఆ భారీ కొండచిలువ నుంచి తప్పించుకోవడం ఆ కుక్క వల్ల కాలేదు. కుక్క చనిపోయాక దానిని ఆ కొండ చిలువ ఒక్కసారిగా మింగేసింది. అనంతరం అక్కడే కదలకుండా ఉండిపోయింది. దీంతో కార్మికులు గోవింద్ శర్మ అనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వెళ్లిన గోవింద్ శర్మ కొండ చిలువను పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశాడు. 

Updated Date - 2022-07-27T21:26:31+05:30 IST