
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారానికి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భద్ర కల్పించిన 14 మంది పంజాబ్ పోలీసులకు ‘డీజీపీ ప్రశంసా పురస్కారం’ లభించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరి 5న ఫిరోజ్పూర్లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉంది. అయితే రైతు నిరసనల నేపథ్యంలో మోదీ కాన్వాయ్ ముందుకు కదలలేకపోయింది. ఆ సమయంలో ప్రధానికి, ఆయన సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంజాబ్‌కు చెందిన కొంత మంది పోలీసులు రక్షణ కల్పించారు. ఇదే సమయంలో మోదీ భద్రత అంశంపై పంజాబ్ పోలీసులు తీవ్ర విమర్శలు గురయ్యారు.
ఇవి కూడా చదవండి
మార్చి 26 పంజాబ్ డీజీపీ వీకే భవ్రా ఈ ప్రకటన చేశారు. మొత్తం 14 మంది పంజాబ్ పోలీసులు ఈ అవార్డు అందుకున్నారు. హర్షర్డే నింబ్లే, హరిష్ ఓం ప్రకాష్, రాజ్‌పాల్ సింగ్ సంధు, ఓపిందర్‌జిత్ సింగ్ ఘుమాన్, సతిందర్ సింగ్, గుర్మీత్ సింగ్, జగ్మోహన్ సింగ్, సింగ్ ఖాఖ్, జస్కత్రాంజిత్ సింగ్ తేజ, రాజేశ్వర్ సింగ్ సిద్ధు, మంజీత్ దేశి, సుహేల్ ఖాసిమ్ మిర్, రాకేష్ యాదవ్, వివే చందర్‌లు డీజీపీ ప్రశంసా పత్రం అందుకున్నారు.
ఇవి కూడా చదవండి