శభాష్‌ అనికా!

ABN , First Publish Date - 2021-09-17T05:30:00+05:30 IST

పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇందుకు మంచి ఉదాహరణ అనికా అగర్వాల్‌. హైదరాబాద్‌కు చెందిన పద్నాలుగేళ్ల అనికా అగర్వాల్‌ చదువుకొంటూనే సోషల్‌ యాక్టివి్‌స్టగా పనిచేస్తూ అందరి మన్ననలు...

శభాష్‌ అనికా!

పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇందుకు మంచి ఉదాహరణ అనికా అగర్వాల్‌. హైదరాబాద్‌కు చెందిన పద్నాలుగేళ్ల అనికా అగర్వాల్‌ చదువుకొంటూనే సోషల్‌ యాక్టివి్‌స్టగా పనిచేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. తను మోటివేషన్‌ స్పీకర్‌ కూడా. అంతేకాదు జంతువుల సంరక్షణ, మహిళా సాధికారత, బాలికల సంరక్షణపై నిర్వహించే ఈవెంట్లకు తప్పక హాజరవుతూ ఉంటుంది. సామాజిక అంశాలపై పిల్లలను మోటివేట్‌ చేస్తున్నందుకు గానూ ‘నేతాజీ బాల్‌ ప్రేరణ అవార్డు’ను అందుకున్నారు. తన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు అనికా అగర్వాల్‌.

Updated Date - 2021-09-17T05:30:00+05:30 IST