మహిళా నుంచి 140 కిలోల marijuana స్వాధీనం

ABN , First Publish Date - 2021-11-01T17:17:41+05:30 IST

పుదుక్కోట జిల్లాలో 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక మహిళను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఆంధ్రప్రదేశ్‌ నుంచి గంజాయిని

మహిళా నుంచి 140 కిలోల marijuana స్వాధీనం

చెన్నై/అడయార్‌: పుదుక్కోట జిల్లాలో 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక మహిళను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఆంధ్రప్రదేశ్‌ నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేయించి స్థానికంగా విక్రయిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పుదుక్కోట, తంజావూరు, కుంభకోణం, శివగంగై, కోట్టైపట్టిణం తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతు న్నట్టు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం వచ్చింది. దీంతో ప్రత్యేకంగా పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసి నిఘా సారించారు. ఈ క్రమంలో పుదుక్కోటకు చెందిన జానకి అనే మహిళ మదురైకు చెందిన సెల్వి, బాలు సహాయంతో ఆంధ్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తు న్నట్టు గుర్తించి, ఆమెను అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-11-01T17:17:41+05:30 IST