Punjab National Bankలో పోస్టులు భర్తీ

ABN , First Publish Date - 2022-04-22T19:43:45+05:30 IST

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

Punjab National Bankలో పోస్టులు భర్తీ

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టు: స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

పోస్టుల వారీగా ఖాళీలు: మేనేజర్లు(రిస్క్‌)-40; మేనేజర్లు(క్రెడిట్‌)-100; సీనియర్‌ మేనేజర్లు(ట్రెజరీ)-05

అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/సీఎంఏ(లేదా) కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఎంబీఏ(ఫైనాన్స్‌)/పీజీడీఎం(ఫైనాన్స్‌)/తత్సమాన పీజీ డిగ్రీ(ఫైనాన్స్‌) ఉత్తీర్ణత. పని అనుభవం ఉండాలి.

వయసు: 25 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 220 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో పార్ట్‌-1, పార్ట్‌-2 విభాగాలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. పార్ట్‌-1లో రీజనింగ్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్క ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పార్ట్‌-2 ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు సంబంధించింది. దీనికి 100 మార్కులు కేటాయించారు. 50 ప్రశ్నలు ఇస్తారు. పార్ట్‌-1, పార్ట్‌-2లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని పర్సనల్‌ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూ 25 మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.850; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.50 చెల్లించాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 7

పరీక్ష తేదీ: జూన్‌ 12

వెబ్‌సైట్‌: https://www.pnbindia.in/

Updated Date - 2022-04-22T19:43:45+05:30 IST