లోక్‌అదాలత్‌లో 1,470 కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-14T05:28:03+05:30 IST

మదనపల్లె కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 1,470 కేసులు పరిష్కారమైనట్లు ఏడీజే భాస్కర్‌రావు చెప్పారు.

లోక్‌అదాలత్‌లో 1,470 కేసుల పరిష్కారం
తంబళ్లపల్లెలో కేసులు పరిస్కరిస్తున్న ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తి ఆసీపా సుల్తానా

మదనపల్లె క్రైం, ఆగస్టు 13: మదనపల్లె కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో  1,470 కేసులు పరిష్కారమైనట్లు ఏడీజే భాస్కర్‌రావు చెప్పారు. ఇందులోభాగంగా సివిల్‌, క్రిమినల్‌, మోటారు వాహన ప్రమాదబీమా, మెయింటెనెన్స్‌ తదితర కేసులతో సహా మొత్తం 1,470 కేసులను పరిష్కరించి, రూ.2.72 కోట్లు రాజీ కుదిర్చిన సొమ్మును కక్షిదారులకు అందజేశామన్నారు. ఈ సందర్భంగా ఏడీజే మాట్లాడుతూ లోక్‌అదాలత్‌ తీర్పే అంతిమ తీర్పు, రాజీమార్గమే రాచమార్గమన్నారు. ఇందులో కేసులను పరిష్కరించుకుంటే నగదు, సమయం ఆదా అవుతుందన్నారు. నాలుగు బెంచ్‌లను ఏర్పాటు చేసి కేసులను పరిష్క రించినట్లు ఏడీజే పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు వెంకటేశ్వర్లునాయక్‌, శ్రీనివాసులురెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, న్యాయవాదులు, కోర్టుసిబ్బంది, ఆయాశాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె జూనియర్‌ సివిల్‌ కోర్టులో శనివారం నిర్వ హించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో ఇరు వర్గాల కక్షిదారుల రాజీ మా ర్గం ద్వారా 190 కేసులు పరిష్కారమవ్వగా..రూ.2,43,520లు రికవరీ చేసి నట్లు ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తి ఆసీపా సుల్తానా తెలిపారు. శనివారం తంబళ్లపల్లె సివిల్‌ కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ షరీప్‌, ఏఎస్పీ ప్రభాకర్‌ రెడ్డి, ఏపీపీ రామకృష్ణ, న్యాయవాదులు గపార్‌, శ్రీనివాసులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కాగా తంబళ్లపల్లె సివిల్‌ కోర్టులో కోసువారిపల్లె పీహెచ్‌సీ వైద్యాధికారి నిరంజన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి న్యాయమూర్తితో పాటు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పీహెచ్‌ఎన్‌ సుమలత, ఎంఎల్‌హెచ్‌పీ సిమ్రాన్‌, ఏఎన్‌ఎం విజయకుమారి, కవిత, హెల్త్‌ అసి స్టెంట్లు గంగయ్య, వెంకటేశ్వర్లు, భువనగిరి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. 

వాల్మీకిపురంలో: క్షణికావేశంతో కేసులు పెట్టుకుని జీవితాలను దుర్భ రం చేసుకోరాదని వాల్మీకిపురం జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి సీహెచ్‌వీ రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం కోర్టులో మండల న్యాయసేవాధికార సంస్థ  ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సంద ర్భంగా  సివిల్‌, క్రిమినల్‌, బ్యాంకుల రుణాలు, తదితర మొత్తం 140 కేసులను పరిష్కరించారు. పలు కేసులకు సంబంధించి రూ.17,20,630ల నగదు రికవరీలు చేశారు. కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ సభ్యులు డాక్టర్‌ శ్రీనివాసులు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రెడ్డెప్ప, న్యాయవాదులు ద్వారకనాథరెడ్డి, రవిప్రకాష్‌, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, పోలీసు లు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. కోర్టులో ప్రతి రోజు నిర్వహిస్తున్న ఫ్రీ సిట్టింగ్స్‌లో కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు.  

Updated Date - 2022-08-14T05:28:03+05:30 IST