కీళపట్టులో రుద్రాక్షల శివుడు

ABN , First Publish Date - 2021-03-09T07:02:42+05:30 IST

మహా శివరాత్రి ఉత్సవాలకు నగరి మండలం కీళపట్టులో వెలసిన త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వరాలయం ముస్తాబైంది.

కీళపట్టులో రుద్రాక్షల శివుడు
రుద్రాక్షల రుద్రశివుడు, నందీశ్వరుడు

పుత్తూరు, మార్చి 8: మహా శివరాత్రి ఉత్సవాలకు నగరి మండలం కీళపట్టులో వెలసిన త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వరాలయం ముస్తాబైంది. కాగా, ఆలయ నిర్వాహకులు 50 వేల రుద్రాక్షలతో ప్రత్యేకంగా నందిపై కొలువుదీరిన రుద్రతాండవ శివుడిని తీర్చిదిద్దారు. 15 అడుగుల ఎత్తున్న ఈ ఆకృతిని శిల్పకళాకారులు సుబ్రహ్మణ్యం, గణేష్‌ రూపొందించారు. దీంతోపాటు ఆవుపేడతో 1008 శివలింగాలు ఆలయ ఆవరణలో భక్తులకు కనువిందుచేయనున్నాయి. ఏటా ఆలయంలో విభిన్న అలంకారంలో శివుడిని తీర్చిదిద్దడం ఆనవాయితీగా వస్తోంది. దీంతోపాటు ప్రత్యేకంగా పంచభూత శివలింగాలను కూడా తయారు చేశారు. రుద్రాక్ష శివుడిని దర్శించుకున్న భక్తులు పంచభూతాల శివలింగాలను దర్శించుకుంటే కైలాసంలో ఉన్నామన్న అనుభూతి కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.



Updated Date - 2021-03-09T07:02:42+05:30 IST