పట్టుబడిన మద్యం సీసాలతో సెబ్ సిబ్బంది
భీమవరం క్రైం, జూన్ 25 :
భీమవరం సెబ్ స్టేషన్ పరిధిలో రెండేళ్లలో పట్టుబడిన సుమారు రూ. పదిహేను
లక్షల యాభై వేల విలువైన మద్యం సీసాలను భీమవరం 29వ వార్డు పరిధిలోని
యనమదుర్రు డ్రెయిన్ వంతెనపై శనివారం ధ్వసం చేసినట్టు సెబ్ ఇన్‌స్పెక్ట
ర్ వీవీవీఎస్‌ఎన్ వర్మ తెలిపారు. 374 మద్యం కేసుల్లో ప్రభుత్వానికి
స్వాధీనం చేసిన 6,850 మద్యం సీసాలను సుమారు 2,230 లీటర్ల మద్యాన్ని ధ్వంసం
చేసినట్టు తెలిపారు. సెబ్ అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, సెబ్ ఏఈఎస్
భార్గవ పర్యవేక్షణలో మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించారు.