తోటి విద్యార్థిని కాల్చి చంపిన 15 ఏళ్ల యువకుడు.. అమెరికాలో..

ABN , First Publish Date - 2021-03-02T17:14:36+05:30 IST

అమెరికాలో 15 ఏళ్ల యువకుడు తోటి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆర్కన్సాస్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

తోటి విద్యార్థిని కాల్చి చంపిన 15 ఏళ్ల యువకుడు.. అమెరికాలో..

అర్కన్సాస్: అమెరికాలో 15 ఏళ్ల యువకుడు తోటి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆర్కన్సాస్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో నిందితుడు తోటి విద్యార్థిని తుపాకీతో కాల్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఓ జాగిలం ద్వారా నిందితుడి ఆచూకీని కనుగొన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు మైనర్ కావడంతో ఇప్పటివరకు అతడిపై ఎటువంటి కేసు నమోదు చేయనట్టు తెలుస్తోంది. 


నిందితుడు అసలు తోటి విద్యార్థిని ఎందుకు కాల్చాడన్న దానిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, నిందితుడు కావాలనే తోటి విద్యార్థిని కాల్చినట్టు తాము భావిస్తున్నామన్నారు. చాలా రోజుల తర్వాత సోమవారమే స్కూలు ప్రారంభం కాగా.. మొదటి రోజే ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం విచారకరమని స్కూలు యాజమాన్యం తెలిపింది. పాఠశాల ప్రారంభించిన మొదటిరోజే ఈ దుర్ఘటన జరగడంతో స్కూలును మళ్లీ యూసివేసినట్టు యాజమాన్యం చెప్పింది.

Updated Date - 2021-03-02T17:14:36+05:30 IST