1500 కిలోల గంజాయి స్వాధీనం

Published: Thu, 26 May 2022 00:56:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
1500 కిలోల గంజాయి స్వాధీనంగంజాయితో పట్టు బడిన వ్యాన్‌

చీడికాడ, మే 25 : మండలంలోని వరహాపురం సమీపంలో గంజాయిని తరలిస్తున్న ఓ వ్యాన్‌ను పోలీసులు గుర్తించారు. వ్యాన్‌తో సహా 1500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ కె.సుధాకర్‌ తెలిపిన వివరాలివి. మంగళవారం రాత్రి వరహాపురం మీదుగా వస్తున్న ఓ వ్యాన్‌ భారీ వర్షం కారణంగా బురదలో చిక్కుకుంది.  దానిని బయటకు లాగేందుకు ఆ వ్యక్తులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేది లేక వాహనాన్ని అక్కడ వదిలి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తాము బుధవారం మధ్యాహ్నం వెళ్లి చూడగా, ఆ వాహనంలో 1500 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించామన్నారు. అనంతరం గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.