157 మంది విద్యార్థులు.. మూడే గదులు!

ABN , First Publish Date - 2021-11-08T06:41:51+05:30 IST

మండలంలోని వడ్రవన్నూరు ఉన్నత పాఠశాల లో 6-10వ తరగతి వరకు 157 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

157 మంది విద్యార్థులు.. మూడే గదులు!
వడ్రవన్నూరు పాఠశాలలో చెట్ల కింద పాఠాలు వింటున్న విద్యార్థులు

రాయదుర్గం రూరల్‌, నవంబరు 7: మండలంలోని వడ్రవన్నూరు ఉన్నత పాఠశాల లో 6-10వ తరగతి వరకు 157 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి మూ డు తరగతి గదులు ఉన్నాయి. దీంతో బోధనకు సరిపడా గదులు లేక విద్యార్థులు ప్రతి రో జూ క్లాసులు వినేందుకు చెట్ల కింద, వరండాలో కూర్చొంటున్నారు. పాఠశాలను 2018-19 లో పదవ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేసినా ఆమేరకు సదుపాయాలు కల్పించలేదు. ఫలి తంగా విద్యార్థులు అసౌకర్యాల నడుమ నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీ ట వేస్తోందని చెబుతున్నా.. ఆచరణలో విఫలమైందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఎంఈవో నాగమణిని వివరణ కోరగా.. పాఠశాల రెండవ విడత నాడు-నేడు ప నులకు ఎంపికైందని తెలిపారు. విద్యార్థులకు అదనంగా మూడు తరగతి గదులు మం జూరయ్యాయన్నారు. నిధులు మంజూరైన వెంటనే గదుల నిర్మాణాలు ప్రారంభించి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-08T06:41:51+05:30 IST