15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

ABN , First Publish Date - 2021-03-02T06:02:25+05:30 IST

జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తు పంచా యతీరాజ్‌శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ జీవో జారీ చేశారు.

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

 చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 1: జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తు పంచా యతీరాజ్‌శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ జీవో జారీ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులను కేటాయించారు. 1411 గ్రామ పంచాయతీలకు 70శాతం, 65 మండల పరిషత్‌లకు 15శాతం, జిల్లా పరిషత్‌కు మరో 15శాతం నిధులను కేటాయించారు. జిల్లాకు మొత్తం రూ.57,93,81,800 కేటాయించారు. ఇందులో గ్రామ పంచాయతీలకు రూ.40,55,67,400, మండల పరిషత్‌లకు రూ.8,49,07,200, జిల్లా పరిషత్‌కు రూ.8,49, 07,200 కేటాయించారు.   గ్రామ పంచాయతీల్లో ఉన్న విద్యుత్‌ బకాయిల్లో 40శాతం మేర  చెల్లించాలని పంచాయతిరాజ్‌శాఖ కమిషనర్‌ తెలిపారు. 14వ , 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధుల నుంచి ఆ బకాయిలు చెల్లించాలని కమిషనర్‌ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-02T06:02:25+05:30 IST