సున్నా వడ్డీ కింద రైతులకు రూ.16.20కోట్ల రాయితీ

ABN , First Publish Date - 2021-04-21T06:29:10+05:30 IST

సున్నా వడ్డీ కింద జిల్లాలోని 61,496 మంది రైతులకు రూ.16.20 కోట్లు లభించిందని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.

సున్నా వడ్డీ కింద రైతులకు రూ.16.20కోట్ల రాయితీ

కలెక్టర్‌ పోలా భాస్కర్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 20 : సున్నా వడ్డీ కింద జిల్లాలోని 61,496 మంది రైతులకు రూ.16.20 కోట్లు లభించిందని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రైతులకు వడ్డీ రాయితీ సొమ్మును సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పందన భవన్‌లో కాన్ఫరెన్స్‌ అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. 2019-20 రబీ సీజన్‌లో జిల్లాలో 4,57,968మంది రైతులకు రూ.472కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయని తెలిపారు. అందులో సున్నా వడ్డీ పంట రుణాలను 63,076 మంది తీసుకోగా సకాలంలో తిరిగి చెల్లించిన 61,496మందికి వడ్డీ రాయితీ పడిందన్నారు. అనంతరం కలెక్టర్‌ పోలా భాస్కర్‌, జేసీ వెంకటమురళి, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ పర్చూరు ఇన్‌చార్జి రామనాఽథంబాబులు రైతులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు పీవీ శ్రీరామమూర్తి, బేబీరాణి, రవీంద్రబాబు, నాగరాజు, ఎల్‌డీఎం యుగంధర్‌, వ్యవసాయ సలహాబోర్డు చైర్మన్‌ ఆళ్ల రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-21T06:29:10+05:30 IST