16 మంది Ips అధికారుల బదిలీ

ABN , First Publish Date - 2022-06-28T17:04:24+05:30 IST

ఏడాది కాలంగా ఒకే ప్రాంతం లో పనిచేస్తున్న 16 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ

16 మంది Ips అధికారుల బదిలీ

బెంగళూరు, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ఏడాది కాలంగా ఒకే ప్రాంతం లో పనిచేస్తున్న 16 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. జోషి శ్రీనాథ్‌ మహదేవ్‌ - ఎస్పీ లోకాయుక్త, కేఎం శాంతరాజ్‌ - బెస్కాం, సీకే బాబా - ఆగ్నేయ డీసీపీ, సంజీవ్‌పాటిల్‌ - బెళగావి ఎస్పీ, కళాకృష్ణ స్వామి - తూర్పు డీసీపీ, హరీశ్‌పాండే - ఏసీబీ ఎస్పీ, లక్ష్మణ్‌ హింబరిగి - బెంగళూరు పశ్చిమ డీసీపీ, నాగేశ్‌ - చిక్కబళ్లాపుర ఎస్పీ, శ్రీనివాసగౌడ - సెంట్రల్‌ డీసీపీ, మిథున్‌కుమార్‌ - సీఐడీ ఎస్పీ, కృష్ణకాంత్‌ - దక్షిణ డీసీపీ, హరిరామ్‌ శంకర్‌ - హాసన్‌ ఎస్పీ, జైప్రకాశ్‌ - బాగల్కోటె ఎస్పీ, శోభారాణి - ఏసీబీ ఎస్పీ, శివాన్షు రాజ్‌పుథ్‌ - హుమ్నాబాద్‌ ఏఎస్పీగా బదిలీ చేశారు. 

Updated Date - 2022-06-28T17:04:24+05:30 IST