కరోనాతో జిల్లా కేంద్రంలో 16 మంది మృతి

ABN , First Publish Date - 2021-04-23T05:17:53+05:30 IST

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌తో చికిత్స పొందుతూ 16 మంది మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

కరోనాతో జిల్లా కేంద్రంలో 16 మంది మృతి

పెద్ద బజార్‌, ఏప్రిల్‌ 22: ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌తో చికిత్స పొందుతూ 16 మంది మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కరోనా పాజిటివ్‌ లక్షణాలతో జిల్లా ఆసుపత్రికి వచ్చిన వీరు కరోనా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. వీరంతా బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌కు చెందినవారుగా అధికారులు తెలిపారు.

ఆర్మూర్‌లో ఐదుగురు మృతి 

ఆర్మూర్‌ : పట్టణంలో గురువారం కరోనాతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. రాజారాంనగర్‌కు చెందిన ఇద్దరు, అశోక్‌నగర్‌కు చెందిన ఒకరు, శాస్త్రీనగర్‌కు చెందిన ఒకరు, ఔట్‌గల్లీకి చెందిన ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. 

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ మృతి

ఖిల్లా : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఉంటున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ (30), ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌(54) కరోనాతో గురువారం మృతి చెందారు. ఒక రికి ఈనెల 18న, మరొకరు 20వ తేదీన కరోనా బారిన పడ్డా రు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న వీరు గురువారం సాయంత్రం మృతి చెందినట్లు  పోలీసు వర్గాలు తెలిపాయి.

ఉప్లూర్‌లో ఇద్దరు

కమ్మర్‌పల్లి: మండంలోని ఉప్లూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనాతో మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇదివరకు కరోనా పాజిటివ్‌ రాగా కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పూజారి గురువారం ఉదయం మరణించారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు సైతం మృతిచెందింది. 

నవీపేటలో ఇద్దరు 

నవీపేట, : మండలంలో గురువారం కరోనాతో ఇద్దరు మృతి చెందారని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. మం డలంలోని స్టేషన్‌ఏరియాకు చెందిన 33సంవత్సరాల వ్యక్తి కరోనాతో గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసు పత్రిలో మృతిచెందాడని మృతదేహానికి సాయంత్రం కొవిడ్‌ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు గ్రామస్థులు తెలిపారు. నవీపేటకు చెందిన 55 ఏళ్ల మహిళ కరోనాతో గురువారం మృతిచెందిందని గ్రామస్థులు తెలి పారు. మృతదేహానికి గురువారం సాయంత్రం కొవిడ్‌ నిబంధనల ప్రకారం అంత్యక్రియలను నిర్వహించినట్లు గ్రామస్థులు తెలిపారు. 

రెంజల్‌లో ఒకరు 

రెంజల్‌ : మండలంలోని దూపల్లి గ్రామంలో 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతిచెందాడు. ఆరు రోజుల క్రితం కరోనా నిర్ధారణ కాగా ఇంటి వద్దనే ఉంచి వైద్యం అందిస్తుండగా మృతిచెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. 


Updated Date - 2021-04-23T05:17:53+05:30 IST