
అమరావతి: ఏపీలో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,608 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20,27,650కు పాజిటివ్ కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఆరు మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 13,970 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం 15,119 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 19,98,561 మంది రికవరీ అయ్యారు.