చేతిలో లక్షతో దొరికిపోయిన కుమార్తె.. నిజం తెలిసి నిర్ఘాంతపోయిన తండ్రి!

Jul 23 2021 @ 17:19PM

ఇంటర్నెట్ డెస్క్: రహస్యంగా తన గదిలో ప్రవేశించిన కుమార్తెను చూశాడా తండ్రి. తన గదిలో కుమార్తెకు ఏం పని? అని అనుమానం వచ్చింది. వెంటనే వచ్చి చూస్తే బీరువాలో నుంచి లక్ష రూపాయలు కాజేస్తూ కుమార్తె కనిపించింది. ఇది చూసిన ఆ తండ్రికి కోపం కట్టలు తెంచుకుంది. కుటుంబ సభ్యులందర్నీ పిలిచి పంచాయతీ పెట్టాడు. అసలేం జరుగుతోందని కుమార్తెను నిలదీశాడు. అప్పుడు ఆమె బయటపెట్టిన నిజం విని ఆ కుటుంబం అంతా నిర్ఘాంతపోయింది. ఇంతకీ ఆ పదహారేళ్ల అమ్మాయి ఏం చెప్పిందంటే..


సదరు యువతికి పొరుగింట్లో ఉండే 17 ఏళ్ల యువకుడితో పరిచయం ఉంది. వీళ్లిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో అమ్మాయి తండ్రి పొలం అమ్మేశాడని, ఆయన వద్ద రూ.4కోట్లు ఉన్నాయని ఆ ప్రియుడికి తెలిసింది. అంతే అప్పటి వరకూ ‘‘నువ్వే నా లోకం’’ అంటూ మాటలు చెప్పిన ప్రేయసిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తాను తీసిన అశ్లీల వీడియోలను చూపించాడు. తన చేతిలో డబ్బు పడకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన ఆ యువతి అప్పటికే అడపాదడపా రూ.16లక్షలు తీసుకెళ్లి బాయ్‌ఫ్రెండ్‌కు ఇచ్చింది. మరోసారి డబ్బు అడగడంతో ఇలా ఇంట్లో దొంగతనం చేయబోయింది. ఆమె దొరికిపోవడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్లాక్‌మెయిల్ చేస్తున్న ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...