Mumbai లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలి 17 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2022-06-28T22:24:56+05:30 IST

మహారాష్ట్రలోని కోస్టల్ కొంకణ్ ప్రాంతంలో ఎడతెగని వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. వర్షాల కారణంగా..

Mumbai లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలి 17 మంది దుర్మరణం

ముంబై: మహారాష్ట్రలోని కోస్టల్ కొంకణ్ ప్రాంతంలో ఎడతెగని వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. వర్షాల కారణంగా కుర్లా ఈస్ట్ ఏరియా ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల భవనం మంగళవారంనాడు కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని 17 మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే జాతీయ ప్రకృతి వైపరీత్యాల స్పందన బృందం, బీఎంసీ, ముంబై అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి.


కాగా, ఈ ప్రమాదంలో సుమారు 12 మందిని కాపాడామని, వారిని ఘట్కోపార్‌లోని రాజవాడి ఆసుపత్రికి, సియాన్‌లోని మున్సిపల్ జనరల్ ఆసుపత్రికి తరలించినట్టు బీఎంసీ డిజాస్టర్ మెనేజిమెంట్ యూనిట్ తెలిపింది. వీరిలో తొమ్మిది మందిని డిశ్చార్చ్ చేశారని చెప్పింది. మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుబాష్ దేశాయ్, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే (ముంబై సబర్బన్ గార్డియన్ మినిస్టర్) ప్రమాద స్థలిని సందర్శించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.

Updated Date - 2022-06-28T22:24:56+05:30 IST