అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించబోయిన 17 మంది భారతీయుల అరెస్ట్..!

ABN , First Publish Date - 2022-09-03T03:17:28+05:30 IST

అమెరికాలోకి(USA) అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 17 మంది భారతీయులను(Indians) అమెరికా సరిహద్దు గస్తీ దళాలు అరెస్ట్ చేశాయి.

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించబోయిన 17 మంది భారతీయుల అరెస్ట్..!

ఎన్నారై డెస్క్: అమెరికాలోకి(USA) అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 17 మంది భారతీయులను(Indians) అమెరికా సరిహద్దు గస్తీ దళాలు అరెస్ట్ చేశాయి. కాలిఫోర్నియా(California) రాష్ట్రంలోకి కంచె దూకేందుకు ప్రయత్నిస్తూ వీరు గస్తీ అధికారులకు చిక్కారు. అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మొత్తం 100 మంది విదేశీయుల్లో భారతీయులు ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.  మంగళవారం అర్థరాత్రి సుమారు 2 గంటల సమయంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వారందిరికీ మెడికల్ పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ నిర్బంధ కేంద్రాలను తరలించారు. కాగా.. పోలీసులకు చిక్కిన వంద మందిలో 79 మంది పురుషులు, 18 మంది ఫ్యామిలీ యూనిట్ సభ్యులు, ముగ్గురు టీనేజర్లు ఉన్నారు.  మొత్తం 12 దేశాలకు చెందిన వారు ఈ బృందంలో ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 1,45,000 మంది అక్రమ వలసదారులు(Illegal immigrations) అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పోలీసులకు చిక్కారు. వీరిలో దాదాపు 44 వేల పైచిలుకు మంది మెక్సికోయేత దేశాల వారని ప్రభుత్వం పేర్కొంది.  

Updated Date - 2022-09-03T03:17:28+05:30 IST