Jammu And Kashmir : 17 మంది Trekkers ను రక్షించిన Indian Army

ABN , First Publish Date - 2022-06-24T17:36:33+05:30 IST

జమ్ముకాశ్మీర్‌(Jammu And Kashmir)లో ట్రెక్కింగ్(Trekking) చేస్తూ చిక్కుకుపోయిన 17 మంది ట్రెక్కర్ల(

Jammu And Kashmir : 17 మంది Trekkers ను రక్షించిన Indian Army

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌(Jammu And Kashmir)లో ట్రెక్కింగ్(Trekking) చేస్తూ చిక్కుకుపోయిన 17 మంది ట్రెక్కర్ల(Trekkers)ను ఇండియన్ ఆర్మీ(Indian Army) రక్షించింది. ప్రతికూల వాతావరణం, తీవ్ర హిమపాతం కారణంగా విశాంసర్ సరస్సు(Vishansar lake)కు సమీపంలోని సెవెల్-లేక్ ట్రెక్ వద్ద వీరంతా చిక్కుకున్నారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. సోనామార్గ్‌లో ఉండే ఆర్మీ ‘డిస్‌ప్లేస్డ్  ఎక్విప్‌మెంట్ టీమ్’ బాధిత పర్యాటకులను కాపాడింది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించి, దాదాపు 12 గంటలపాటు శ్రమించి పర్యాటకులందరినీ రక్షించామని అధికారులు వెల్లడించారు. అందరినీ రక్షించి దగ్గరలోని ఆర్మీ క్యాంప్‌నకు తీసుకెళ్లారని అధికారులు వివరించారు. ప్రఖ్యాతిగాంచిన సెవెన్-లేక్ ట్రెక్ వద్ద వీరంతా చిక్కుకున్నారని వివరించింది. కాగా తమను రక్షించిన ఇండియన్ ఆర్మీకి బాధితులు కృతజ్ఞతలు ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-06-24T17:36:33+05:30 IST